హర్టికల్చర్ లో డాక్టరేట్ పొందిన ఊరటి మహేష్
వెంకటాపురం గ్రామస్తుల హర్షం వ్యక్తం
అతిచిన్న వయస్సులో పీహెచ్ డీ పొందిన డాక్టర్ మహేష్.
సంతోషం వ్యక్తపరిచిన తల్లిదండ్రులు.
నర్సంపేట,నేటిధాత్రి:
ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించి అందరిమన్ననలు పొందాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి.వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన,మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు.చిన్ననాటి నుండే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.అనంతరం పిహెచ్ డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు.

ఈ యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు. అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.
విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్
విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.

పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది..తల్లిదండ్రులు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
