
Devi Priya in U-15 Cricket
తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్ జట్టుకు తాటిగూడెం యువతి
సభ్యురాలుగా దేవి ప్రియ ఎంపిక
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
కరకగూడెం ,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి…
తెలంగాణ అండర్ -15 మహిళ క్రికెట్ ప్రాబబుల్ జట్టుకు కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామానికి చెందిన బాలిక రామటెంకి దేవి ప్రియ ఎంపికైంది.చదువుతు క్రికెట్ లో సత్తా సాటి,తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్ జట్టుకు ఎంపిక అవ్వడం పట్ల తల్లిదండ్రులు హనుమంతరావు,ఉమామహేశ్వరి సంతోషం వ్యక్తం పరిచారు.
తండ్రికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.క్రికెట్ ఆడుతూ పట్టుదలతో పోటి పరీక్షల్లో సత్తా సాటి ఉపాధ్యాయుడు అయ్యాడు.తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినా తనలో క్రికెట్ అనే ఆశ అలాగనే ఉండిపోయింది.తన కూతురున్ని దేవి ప్రియ క్రికెట్ ప్లేయర్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తండ్రి ప్రోత్సాహంతో హైదరాబాద్ లో నిర్వహించిన మహిళ క్రికెట్ అండర్-15 సెలక్షన్ లో దేవి ప్రియ ఎంపికయ్యింది.హెడ్ కోచ్ సురేందర్ రెడ్డి,కోచ్ లు వెంకట్ యాదవ్,బుచ్చిబాబు,రంజి కోచ్ ఇర్ఫాన్ సైతం ప్రత్యేకంగా అభినందించారు.కరకగూడెం మండాలనికి,తెలంగాణ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.మారుమూల ప్రాంతంలో పుట్టిన దేవి ప్రియ అండర్ -15 మహిళ క్రికెట్ ప్రాబబుల్ జట్టుకు ఎంపిక కావడం పట్ల భద్రాద్రి జిల్లా క్రికెట్ సంఘలు,గ్రామస్తులు,రాజకీయ నాయకులు ప్రత్యేకంగా అభినంధించారు.