
అప్పటి వరకు పెళ్లి చేసుకోను..
యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా ‘జూనియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరీటి హీరోగా నటించిన ఈ చిత్రంలో జెనీలియా ప్రధాన ప్రాతల్లో నటించి మెప్పించింది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శ్రీలీల. గతంలో శ్రీలీల తనను పెళ్లి కూతుర్ని చేసినట్లు కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా.. అందరూ శ్రీలీల పెళ్లి చేసుకుంటుంది అనుకున్నారు.
కానీ అవి అడ్వాన్స్ బర్త్ సెలబ్రేషన్స్ అంటూ రివీల్ చేసింది శ్రీలీల. ఇక దీనిపైనే తాజాగా యాంకర్ సుమ ప్రశ్నించగా.. ‘అది తిథి ప్రకారం చేసుకున్న బర్త్‌డే సెలబ్రేషన్స్. ఇది తెలుగు బర్త్. మా ఇంట్లో సాంప్రదాయకంగా ఎన్నో జరిగితే అందులో కొన్ని మాత్రమే నేను షేర్ చేశాను. ఇక అవి పెట్టిన తర్వాత జనాలు అందరూ నాకు పెళ్లి అని ఫిక్స్ అయిపోయారు. నాకు పెళ్లి అప్పుడే జరగదు. నాకు 23 ఏళ్లు.. 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోను’ అంటూ క్లారిటీ ఇచ్చింది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.