‘సాటి మనిషికి సహాయం చేయాలి’
అభాగ్యులను ఆదుకోవాలి
డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్
మహబూబ్ నగర్/నేటి ధాత్రి

సమాజంలో సాటి మనిషికి సహాయం చేయాలని పాలమూరు క్రిష్టియన్ కాలనీకి చెందిన డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ గురువారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాటిమనిషికి స్వార్థం లేకుండా సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని, సహాయం అనేది అన్ని ఉన్నవారి కంటే.. నిజంగా లేనివారికి లబ్ది చేకూరాలని, మనిషికి ముఖ్యంగా కావాల్సింది కూడు, గూడు, గుడ్డ ఉండాలన్నారు. మొదటగా మనిషి జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలంటే ఆహరం కావాలి. అలాంటి ఆహారాన్ని స్వయంగా మా ఇంట్లో మా అమ్మగారు చేసిన మా ఇంట్లో చేసిన వంటను రైల్వేస్టేషన్, బస్టాండ్, ఆసుపత్రులు మరియు రహదారులో ఆకలితో ఉన్నవారికి రాత్రి సమయంలో అందించడం జరిగిందన్నారు.
కరోనా సమయంలో నిత్యము సాయంత్రం వెల ఆహారం, నీటిని అందించానన్నారు.
ఆ సమయంలో చాలా మంది బయటికి రావాలంటే బయపడేవారని, అ సమయంలో డబ్బు పెడితే కూడా బయట సరిగా ఏమి దొరికేవి కావువన్నారు. కొందరికి చీరలు, పంచలు, దుప్పట్లు, టవల్స్ తో పాటు చెప్పులు, గొడుగులు అందజేశానన్నారు. గోశాలలో పశుగ్రాసాన్ని అందించాలని, విద్యార్థులకు అక్షరమాలతో ఉన్న మెటీరియల్ ను ఉచితంగా అందజేశానన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు.