
Suspended Secretary.
మా పంచాయతీ లో నీకే మీ పని…..
◆:- నిలదీసిన తుంకుంట గ్రామ ప్రజలు..
◆:- సస్పెండ్ అయిన కార్యదర్శి కి సహాయం చేయడానికి వచ్చిన ఇతర మండలం కార్యదర్శి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం లోని తుంకుంట గ్రామం లో ఆదివారం పంచాయతీ కి సంబంధం లేని వ్యక్తి పంచాయతీ కార్యాలయం లో కార్యదర్శి కుర్చీలో కూర్చున్న కొత్త వ్యక్తి కనిపించడం తో గ్రామ ప్రజలు ఆ వ్యక్తి ని నిలదీశారు. దింతో ఆయన నేను కంది మండలం కు చెందిన పంచాయతీ కార్యదర్శి ని అని చెప్పడం తో నీకు మా పంచాయతీ లో నీకు ఏమి పని ఉంది అని అగ్రహం వ్యక్తం చేశారు. దింతో ఆయన మా స్నేహితుడికి సహాయం చేయడానికి వచ్చాను మీరు మీ స్నేహితుడికి సహాయం చేయరా అని ప్రశ్నించారు.
వెంటనే జహీరాబాద్ ఎంపిడిఓ మహేందర్ రెడ్ది కి గ్రామస్తులు సమాచారం తెలుపడం తో ఆయన వెంటనే మీరు అక్కడి నుండి రండి అనగానే వారు వెనుదిరిగి వచ్చారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయి వారం రోజులు గడిచిన మా గ్రామానికి ఇంతవరకు గ్రామ కార్యదర్శి ని నియమించకపోవడంతో మా సమస్య లు ఎవరికి చెప్పాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు గ్రామ కార్యదర్శి గా నియమించాలి అని కోరారు.