
మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం
మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
ముత్తారం :- నేటిధాత్రి
ముత్తారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం,ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ మాట్లాడుతూ ఇటీవల కూలిన ఓడేడు బ్రిడ్జిపై మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనవి కావని హెచ్చరించారు.
టిఆర్ఎస్ హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టిన అనంతరమే సదరు కాంట్రాక్టుతో నా కమిషన్ నాకు కావాలి అని అతనిని బెదిరించినది నువ్వు కాదా..
మూడు నెలల క్రితం బ్రిడ్జి కూలిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు కి స్థానిక ముత్తారం మండల నాయకులు తెలియజేయగానే సంబంధిత అధికారులను పిలిచి బ్రిడ్జికి అయ్యే ఖర్చు ఎంత అని కొత్త ఎస్టిమేంట్ 63 కోట్లుగా తయారు చేశారు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక బ్రిడ్జి కూలీన నుండి ఇప్పటివరకు మేము ఒక్క మట్టి పెల్ల పని కూడా ఆ బ్రిడ్జి పైన చేయలేదు ..
అంటే అది మీ బీఆర్ఎస్ హయాంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి పనులు చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ లాస్ట్ 8 సంవత్సరాల వరకు కూలేటట్టు అయింది గాని ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు..ఏరోజు అయినా ఆ బ్రిడ్జి యొక్క నాసిరకం గురించి నీ వంతుగా ఏ ఒక్క రోజైనా సంబంధిత కాంట్రాక్టర్ తో నువ్వు మాట్లాడవా.. మీ ప్రభుత్వ హయాంలో యుద్ధ ప్రాతిపదికన సదరు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించుకుంటూ పోతే ఈ బ్రిడ్జి సగం పనిలో ఆగేనా నీ అనాలోచిత నిర్ణయాల కారణం వల్ల ఈరోజు బ్రిడ్జి ఇన్ని సంవత్సరాల వ్యవధిలో పనులు ఆగిపోయి కూలడానికి ముఖ్య కారణం నువ్వే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది.. మరొకసారి గనక దుద్ధిళ్ల శ్రీధర్ బాబు పైన గాని శ్రీను బాబు పైన గాని అవాకులు చివాకులు మాట్లాడితే ప్రజా క్షేత్రంలో నీకు శిక్ష తప్పదు అని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో ముత్తారం మండల మహిళా అధ్యక్షురాలు గోవిందుల పద్మా ఆనంద్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు అనుముసమ్మయ్య,ముత్తారం మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కోల విజయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని బుచ్చం రావు,తూటి రఫీ,రాపల్లి రామన్న,బాలసాని రాజ్ కుమార్,చేలుకల జితేందర్,అనుము ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు…