
Nizampet Police Station.
— పోగొట్టుకున్న ఫోన్ ను సీఈఐఆర్ తో పొందవచ్చు
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రశాంతను వ్యక్తి మూడు నెలల క్రితం తన మొబైల్ ఫోన్ను నిజాంపేటలో పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే నిజాంపేట పోలీస్ స్టేషన్లో సీఈఐఆర్ వెబ్సైట్లో అప్లై చేశారు. సిఈఐఆర్ వెబ్సైట్ ద్వారా మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి శుక్రవారం బాధితుడికి మొబైల్ ఫోన్ అందజేసినట్లు నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే అధైర్య పడకుండా మీసేవ కేంద్రాల్లో, పోలీస్ స్టేషన్లో సిఈఐఆర్ అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని మండల ప్రజలకు సూచించారు.