Peddhi Sudarshan Reddy Developed Narsampet: BRS
“మాజీ ఎమ్మెల్యే పెద్దిని విమర్శించే స్థాయా మీదీ..*
*నర్సంపేటను అభివృద్ధి చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి
నియోజకవర్గలో విధ్వంసం సృష్టించిన కాంగ్రెస్ నాయకులు
విద్య ,వైద్య,సాగు,త్రాగు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన పెద్ది
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే నర్సంపేట నియోజకవర్గలో విధ్వంసం సృష్టించి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని టిఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ, మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఆసాధనకై అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.నిరంతరం నియోజకవర్గ అభివృద్ధినీ ఆకాంక్షించే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఖబర్దార్ అంటే..సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో తెలపాలన్నారు.పాకాల సరస్సు, రంగయచెరువు, మాదన్నపేట చెరువులకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఎన్నో దశాబ్దాల నాటి కలను సహకారం చేసిన జలసాధకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.నర్సంపేట పట్టణ అభివృద్ధికై రూ. 42 కోట్ల టియుఎఫ్ఐయు డబ్ల్యూ నిధులు తెచ్చి పట్టణ అభివృద్ధికై పట్టం కట్టారని తెలిపారు.నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ , నర్సింగ్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని తీసుకొచ్చి నియోజకవర్గాన్ని విద్యా,వైద్య హబ్ గా తీర్చిదిద్దిన ఘనుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొరియాడారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 10 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ పనులు,9 కిలోమీటర్ల మేర అంతర్గత బిటి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.నర్సంపేట పట్టణానికి పాకాల ఆడిటోరియం,మోడల్ వెజిటేబుల్ మార్కెట్,మినీ స్టేడియం,పట్టణ పకృతి వనం,పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకుల నిర్మించారని తెలిపారు.
ఖానాపురం మండలంలో గల అశోక్ నగర్ గ్రామానికి సైనిక్ స్కూల్ తెచ్చిన ఘనత పెద్దిదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గానికి నయా పైసా కూడా తీసుకురాని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.
ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గం లో ఆ పార్టీ నాయకులు చేస్తున్న అభివృద్ధి పనులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని చూసి ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని చెప్పారు.శాసనసభ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే ప్రజలే తరిమి కొడతారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజ్,పట్టణ ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ నాగిశెట్టి ప్రసాద్,దేవోజు సదానందం,రాయిడి దుష్యంత్ రెడ్డి, పెండం వెంకటేశ్వర్లు, పుల్లూరు స్వామి,వార్డు అధ్యక్షులు రావుల సతీష్,బీరం నాగిరెడ్డి,సంపంగి సాలయ్య, ఐలోని శ్రీనివాస్, నాయిని వేణు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పల సుదర్శన్,రాంప్రసాద్,కడారి కుమారస్వామి, మద్దెల సాంబయ్య,మంద ప్రసాద్, ఆంబోతు రాజు,తోటకూరి సదానందం, గిరగాని సాంబయ్య, పైసా ప్రవీణ్,ముచిక రాజు,బుస రాజు ,చేరాల గోవర్ధన్, గోనెల కరుణాకర్, మాదాసి శ్రీనివాస్, మాదాసి ప్రవీణ్, దేవోజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
