ఓ మహిళ జగతికి నీవే ఆదారం..
సిడి ఆవిష్కరించిన సిఐ.
చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాల యంలో శనివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని రచయిత దాసరపు నరేష్ రచించిన జగతికి నీవే ఆధారం సిడి ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి న సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గు మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా సిడి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పురిటి నొప్పుల పుట్టుక నీది నీవు లేకుంటే మనుగడ లేదు అనే పాట రాసి మహిళల గొప్పతనాన్ని వర్ణించి రాసిన రచయిత దాసరి నరేష్ ను అభినందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి వచ్చిన మహిళ ఉద్యోగులు, పాట రచయిత రచయిత దాసారపు నరేష్,
పాడినవారు రోజా, సంధ్య , ఈ పాటకి మ్యూజిక్ అందించిన కిట్టు,
కళాకారులు..
పుల్ల ప్రతాప్ , మ్యాదరి సునీల్, బానోతు రాజు నాయక్, దూడపాక దివాకర్, డప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.