తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం బదనపల్లి టెక్స్టైల్ పార్కు నందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో ఆది యోగి ఉప్పల శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందులో మనం ఉండాలని అనే నినాదంతో చేస్తున్న యోగా సాధన ప్రయత్నంలో మీరందరూ పాలుపంచుకుంటున్నందుకు ధన్యవాదములు తెలుపుతూ అలాగే ప్రజలందరూ యోగా శిక్షణ కేంద్రంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకుంటూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండపల్లి డ్రైవింగ్ స్కూల్ సంబంధించిన వారు ప్రజలు తదితరులు పాల్గొన్నారు