
Smartphone Cooking Video Hack Goes Viral
వావ్.. నీ తెలివికి సలాం తల్లీ.. వంట వీడియోను ఎలా షూట్ చేస్తోందో చూడండి..
ప్రస్తుతం చాలా మంది రకరకాల అంశాలపై వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇంట్లో వండే వంటల నుంచి ఆకాశంలో ఎగిరే విమానం వరకు రకరకాల సమచారాన్ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది రకరకాల అంశాలపై వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇంట్లో వండే వంటల నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు రకరకాల సమచారాన్ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అయితే అలాంటి వీడియోలను షూట్ చేయడానికి కొన్ని పరికరాలు అవసరమవుతాయి. ముఖ్యంగా మొబైల్‌ను తగిలించి వివిధ కోణాల్లో వీడియో తీయడానికి ట్రైపాడ్ అవసరమవుతుంది (smartphone video hack).
అలాంటి ట్రైపాడ్ అవసరం లేకుండా ఓ మహిళ ఓ ట్రిక్ ఉపయోగించి వీడియో షూట్ చేస్తోంది (video hack without tripod). aparajita.debnath అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ వంట చేస్తున్న వీడియోను షూట్ చేయాలనుకుంది. అయితే ఆమె దగ్గర మొబైల్‌ను పెట్టుకునేందుకు ట్రైపాడ్ లేదు. దీంతో ఆమె మొబైల్‌ను అట్లకాడపై ఉంచి రబ్బర్‌తో చుట్టేసింది. ఆ తర్వాత ఆ ఆట్లకాడను బియ్యం నింపిన ప్లాస్టిక్ డబ్బాలో పెట్టింది. దీంతో ఆ మొబైల్ ఎటూ కదలకుండా స్థిరంగా ఉంది