Devotional Ganesh Puja in Srirampur
భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
శ్రీరాంపూర్ ప్రాంతం వాటర్ ట్యాంక్ ఏరియా 9వ వార్డులో శ్రీ శివ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథునికి భారీ సంఖ్యలో ఆ ప్రాంత మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ అర్చనలు చేశారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణనాధునికి భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమాలు చేయడం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు.గణనాధుని ఆశీస్సులతో దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
