బొజ్జ గణపయ్యకి 108 ప్రసాదాలతో పూజలు.
బెల్లంపల్లి నేటిధాత్రి
గత 21 సంవత్సరాలుగా సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ చిన్న పెద్ద కలిసి భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు.
బెల్లంపల్లి బాబు క్యాంప్ బస్తీలో గల సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయకుడికి అత్యంత ఇష్టమైన మోదకం, లడ్డు ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, పూరి, కోవా, పానకము,అరిసి పొంగల్,కుజి,బూందీ,
చారు, నైవేద్యము 108 ప్రసాదాలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు చూపరులను అలరించేలా ఒకే రకమైన చీరలతో గణనాథుని పూజలో పాల్గొన్నారు.
తదనంతరం మహా గణనాథునికి హారతి పాటలతో హారతిపట్టి పూలతో అభిషేకం చేసి ఆ మూషిక వాహనానికి భక్తితో అలరించిన మహిళలు.