
Cotton Farmers in Distress
దిగులు చెందుతున్న పత్తి రైతన్నలు…..!
◆:- భారీ వర్షాలకు పంటకు నష్టం…..
◆:- ఎర్రబారుతున్న పత్తి…..
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారీ వర్షాలకు పత్తి రైతులు నష్టపోతున్నారు. వేల రూపాయలు పెట్టి సాగు చేసిన పత్తి పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బ తిన్నది. ప్రారంభంలో పత్తి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులకు సంబరపడ్డారు. కానీ పంట ఏర్పుగా పెరిగే సమ యంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో పత్తి రైతన్నలు దిగులు
చెందుతున్నారు.
మండల పరిధిలో..
నుంచి మండలంలో కొన్ని సంవత్సరాల రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. మండలంలో 33 వేల ఎకరాల్లో పత్తి సాగైనట్లు అధికారులు తెలిపారు. వర్షం ఎక్కువైనా కొంతమేర పంట తట్టుకుంటుందని ఉద్దేశంతో అన్నదాతలు పత్తి పంట సాగుకు మొగ్గు చూపారు. వర్షాలు
అశజనకంగా ఉండటంతో ప్రారంభంలో ప్రతి చేనుకు ఆశ జనకంగా ఉండేది. పంట ఎక్కువగా పెరగడంతో దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల గత 15 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో అంత బాగా దెబ్బతిన్నది. మండలం లోని పత్తి పంటలు ఎక్కువగా నష్టం వాటిల్లింది.
ఎర్రబారిన పత్తి పంట
భారీ వర్షాల వల్ల పంట ఎరుపు రంగ మారుతుంది. పొలాల్లో నీరు చేరి పంట దెబ్బతింటుంది. ఇప్పటికే ఎకరాకు 15 వేల రూపాయలు ఖర్చు చేసిన రైతులు ఉన్న పంటను కాపాడుకునేందుకు అదనంగా రూ.10 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డాయి. మొక్కల్లో బలం లేక దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కౌలు రైతులు చేతి నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎకరానికి రూ.15వేలు ఖర్చు చేశాం
◆:- మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్, పత్తి రైతు
ఏడెకరాల్లో పత్తి సాగు చేశా. పంట కోసం భారీగా పెట్టుబ డులు పెట్టి ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఖర్చు చేశాను. ఇంకా రసాయన మందులను పిచికారి చేయాలి, కలుపు తీయడం చేయాల్సి ఉంది. ఎకరాకు ఇంకా రూపాయలు 10వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. పెట్టుబడులు పెట్టిన తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎకరానికి కనీసం 10శాతం దిగుబడి వస్తాయి అనుకున్నాము. కానీ సగం కూడా వచ్చే అవకాశాలు లేవు. ప్రభుత్వం పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.