
Balaji Techno School.
బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాలు చాలా అవసరమని, నైపుణ్యాలతోటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే చదువుతో పాటుగా వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాజీవ్ యువ వికాసం లాంటి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకుఅనేక కార్యక్రమాలను, నైపుణ్య శిబిరాలను నిర్వహిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం- 2025 యొక్క ఉద్దేశం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని చంద్,రమేష్,నరసింహారెడ్డి, కృష్ణవేణి,అనిత,హేమలత, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.