ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతిభ స్వచ్ఛంద సేవా సంస్థ,మునిసిపాలిటీ, జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ పట్టణీకరణ వల్ల అడవులు నశించిపోయి భూభాగం మొత్తం సిమెంటు కాంక్రీట్ జంగల్ గా మారి భూమిలో నీరు ఇంకిపోక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. దీనికి ప్రతి ఒక్క ఇంటి నిర్మాణం వద్ద ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలని,అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ప్రతిభ సంస్థ అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ భూమిపై ఏడు పాళ్లు నీళ్లు మూడు పాళ్ళు భూమి ఉన్నప్పటికీ 97.5 శాతం సముద్రాల్లోని పనికిరాని ఉప్పు నీరు ఉండగా రెండున్నర శాతం మాత్రమే మంచినీరు అని అలాగే కూడా ఒక్క శాతం మాత్రమే భూమి ఉపరితలంలో నదులు సరస్సులలో ఉన్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బెజ్జంకి ప్రభాకర్ ,మున్సిపాలిటీ మేనేజర్ సంపత్ కుమార్,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సూర్యతేజ, జూనియర్ అసిస్టెంట్ శివ టెక్నికల్ ఆఫీసర్ నర్సింగరావు, ప్రతిభ సంస్థ వెంకటేశ్వర్లు, వినియోగదారుల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగెల్లి సారంగం, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలో…
ప్రపంచ మంచినీటి దినోత్సవం సందర్బంగా తిమ్మంపేట,తొగర్రాయి ప్రభుత్వ పాఠశాలలో బాలవికాస స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలవికాస కోఆర్డినేటర్ రజిత, దేవేంద్ర రమాదేవి, లక్ష్మిలు విద్యార్థులను ఉద్దెశించి మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలి.భూగర్భ జలాలను డెవలప్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రజలకు అవగహన కల్పించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు,వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.