కరోనా పరిస్థితులు దాడిన తర్వాత భారతీయుల ఆలోచనా సరళిలో చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు సంకేతమే ప్రపంచాన్ని చుట్టేసి రావాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడం. విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనకాడటం లేదట! అంతర్జాతీయ టూరిస్ట్ సంస్థల లెక్కల ప్రకారం విదేశీ పర్యటనకు సగటు భారతీయుడు చేసే ఖర్చు రూ.2లక్షలు! 2023లో 2.82 లక్షల మంది విదేశాలను చుట్టి వచ్చారు. ఇందుకోసం వీరు చేసిన ఖర్చు రూ.2.82లక్షలు! 2034 నాటికి ఈ ఖర్చు రూ.4.78 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా! అంతేకాదు విదేశీ పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య 8కోట్లకు చేరగలదని భావిస్తున్నారు. మనవాళ్లు మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల పట్ల అధిక మోజు కనబరుస్తున్నట్టు ట్రావెల్ సంస్థలు తెలుపు తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులను మరింతగా ఆకర్షించేందుకు వివిధ దేశాలు పలు కొత్త రాయితీలు ప్రకటిస్తున్నాయి.