
World Photography day
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తాండూరు మండలంలోని ఫోటో & వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కి శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్,లయన్స్ క్లబ్ సభ్యులు,ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్,గౌరవ అధ్యక్షులు సబ్బని సమ్మన్న, ప్రధాన కార్యదర్శి ఉప్పల శోభన్,కోశాధికారి రమేష్, మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, ఎస్.కె మహిన్,పుప్పాల సురేష్,రంజిత్,దుర్గాప్రసాద్, షారుక్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.