World Fisheries Day Celebrated in Vardhannapeta
వర్ధన్నపేటలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
వర్దన్నపేట (నేటిధాత్రి):
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకలను వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పిట్టల భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం వర్ధన్నపేట మండల కేంద్రం ఫిరంగిగడ్డలోని ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల పతాక ఆవిష్కరణను వర్ధన్నపేట మత్స్య శాఖ అధ్యక్షుడు భూమా సుధాకర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా మత్స్యశాఖ చీప్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య ముఖ్య అతిథిలుగా హాజరై, మాట్లాడుతూ… తెలంగాణ ముదిరాజ్ మహాసభను డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ వ్యవస్తాపించి నేటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. దీని ద్వారా మత్యకారుల ఎన్నో సమస్యలను, హక్కులను సాధించుకోవడం జరిగిందని అన్నారు. మనం ఐక్యతతో మనజాతి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల అధ్యక్షుడు పిట్టల భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ….

ఫిరంగిగడ్డ నుండి మస్త్యకారులు బైక్ ర్యాలీతో వెళ్ళి, ఇటీవల కాలంలో వచ్చిన మౌంతా తుఫాన్ వల్ల ఏర్పడిన అకాల వర్షాల అన్ని గ్రామాల్లోనీ చెరువులలో మత్స్యకారులు పోసిన చేప పిల్లలు వరదలో కొట్టుకుపోయాయి. మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారనీ అన్నారు. అందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి, మత్స్యకారులకు న్యాయం చేయాలని వర్ధన్నపేట ఎమ్మార్వో విజయసాగర్ కు వినతి అందించారు. అలాగే ప్రభుత్వం మత్స్యకారులకు అందించే ఉచిత చేపపిల్లలను సకాలంలో అందించాలని, చేపపిల్లలకు బదులు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు సంగినేని బీమ్ రాజ్, మండల ఉపాధ్యక్షుడు నారెల్లి సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి పొన్నం స్వామి, మండల యూత్ అధ్యక్షుడు కుక్కల రాకేష్, ప్రధాన కార్యదర్శి ముద్రబోయిన రాజు, కార్యదర్శి బోనాల హరీష్, మైస సురేష్, గబ్బట సహదేవ్, వివిధ గ్రామాల మత్స్యశాఖ అధ్యక్షులు సుంకరి స్వామి, భూమా సుధాకర్, బచ్చల వీరస్వామి, భాషబోయిన సంపత్, కత్తి యాకయ్య, కులపెద్దలు భూమా శ్రీను, ఎద్దు వెంకటేశ్వర్లు, మట్టపల్లి సుభాష్, పిట్టల కుమారస్వామి, సంఘ సభ్యులు బచ్చల స్వామి, నిమ్మనబోయిన సదానందం, రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
