Workshop on Molecular Modeling at GITAM
గీతంలో మాలిక్యులర్ మోడలింగ్ పై కార్యశాల
ప్రధాన శిక్షకుడిగా అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ సీనియర్
అప్లికేషన్ సైంటిస్ట్ డాక్టర్ షంషైర్ సింగ్ సర్దార్
పఠాన్ చేరు, నేటి ధాత్రి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాదులోని పరిశోధనా స్కాలర్లు, బి.ఫార్మసీ చివరి ఏడాది విద్యార్థుల కోసం మాలిక్యులర్ మోడలింగ్, వర్చువల్ స్ర్కీనింగ్ అనే అంశంపై రెండు రోజుల ఆచరణాత్మక వర్క్ షాపును ప్రారంభించింది. పూణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ సీనియర్ అప్లికేషన్ సైంటిస్ట్ డాక్టర్ షంషైర్ సింగ్ సర్దార్ ఈ కార్యశాలకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు.మాలిక్యులర్ మోడలింగ్, ఔషధ పరిశోధన కోసం సమగ్ర వేదిక అయిన మోల్ సాఫ్ట్ ఐసీఎం గురించి ఆయన లోతైన పరిచయాన్ని అందించారు. మోల్ సాఫ్ట్ పరిణామ క్రమం, దాని ప్రపంచ, జాతీయ వినియోగాదారుల వివరాలు, ఐసీఎం ప్రో ఫంక్షనాలిటీలు, పాకెట్ డిసిప్లే (చిన్న ప్రదర్శన), ఐసీఎం-వీఎల్ఎస్, 3డి లిగాండ్ ఎడిటర్ పరిచయం, అధునాత ఏఐ-ఎంఎల్ ఆధారిత సాధానాలు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు.

స్కోరింగ్ ఫంక్షన్లు, ఆర్టీసీఎన్ఎన్ స్కోర్, ప్రేరిత-ఫిట్ డాకింగ్, ఇతర అత్యాధునిక విధానాలతో సహా ఐసీఎం టెక్నాలజీ గురించి కూడా ఆయన విడమరచి చెప్పారు.త్వరలో నిర్వహించనున్న మోల్ సాఫ్ట్ ఇండియా యూజీఎం 2025లో పాల్గొనమని విద్యార్థులను డాక్టర్ సర్దార్ ఆహ్వానించారు. ఇందులో పోస్టర్ ప్రజేంటేషన్ పోటీ ఉంటుందని, విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేస్తామని డాక్టర్ సర్దార్ తెలియజేశారు. ఐసీఎం సాధనాల సాయంతో వారి పరిశోధనలను ప్రదర్శించమని ఆయన పాల్గొనేవారికి ప్రోత్సహించారు.కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడం, పరిశ్రమ-ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ టెక్నాలజీలకు విలువైన సమాచారాన్ని అందించడం లక్ష్యంగా ఈ కార్యశాలను నిర్వహిస్తున్నారు.
