
పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెండెం రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మార్కండేయ కాలనీలో డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయాన్ని పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెండెం రామానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానంద్ మాట్లాడుతూ మార్కండేయ కాలనీకి విశిష్ట చరిత్ర ఉందని, ఎంతోమంది పోరాటాల ఫలితంగా కాలనీ అభివృద్ధి చెందిందని అన్నారు. రానున్న రోజుల్లో కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారం పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నూతన కమిటీ ఆధ్వర్యంలో కాలనీ అభివృద్ధి చెందిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులతో మార్కండేయ కాలనీ పై దృష్టి పెట్టి అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బాల్నే సర్వేశం, అధ్యక్షులు పెండెం శివానంద్, కార్యదర్శి బాలే సుభాష్, కోశాధికారి కొరపాటి మాణిక్యరావు, ఉపాధ్యక్షుడు అడపు కొమ్మాలు, ముఖ్య సలహాదారులు పర్శ శ్రీధర్, జడల శ్రీనివాస్ గొల్లపల్లి మల్లేశం, మాటేటి శ్రీధర్, అందే సాంబయ్య, మహిళా సంఘం వెల్దండి స్వరూప, గాజుల విమల కోదాటి అనిత , యువజన సంఘం బాధ్యులు శ్రీరాములకోటి, కోదాటి గోపాలకృష్ణ బేతి కన్నయ్యతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.