ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం.

Seethakka

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం

రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క..

కొత్తగూడ, నేటిధాత్రి :

 

ప్రజా పాలన లోనే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల యొక్క చిరకాల ఆకాంక్ష అయిన ఇళ్ల స్థలాల మంజూరు సమస్యను కూడా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు.

గురువారం నాడు టీయూడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసన సభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు ములుగు క్యాంప్ కార్యాలయంలో ఐజేయు సభ్యులు కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులను అన్యాయాలకు గురి చేసినటువంటి దుస్థితి గత పాలకులదేనని, కెసిఆర్ కు వత్తాసు పలికే కొన్ని మీడియా యాజమాన్య సంస్థలతో కుమ్మక్కై మీడియా రంగాన్ని అనేక విభాగాలుగా విభజించి ఫోర్త్ ఎస్టేట్ అనే రంగాన్ని పూర్తిగా కనుమరుగు అయ్యే విధంగా వ్యవహరించిన తీరు నాటి పాలకుల పాపమేనని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఇళ్ల స్థలాల మంజూరు,ఆరోగ్యశ్రీ ,హెల్త్ కార్డుల మంజూరు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించే విధంగా

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో విధి విధానాలు చేపడుతున్నామని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు చిరకాల ఆకాంక్ష కోరికైనా ఇళ్ల స్థలాల మంజూరుకు కచ్చితంగా తన వంతు కృషి ఉంటుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల అధ్యక్షుడు ఎస్. కె .సల్మాన్ పాషా, జిల్లా నాయకులు శెట్టి పరశురాం, మహమ్మద్ అజ్మీర్, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్, దేశ వెంకటేశ్వర్లు, మండల ప్రచార కార్యదర్శిలు తీగల ప్రేమ్ సాగర్, ఈక నరేష్, ఉబ్బని శ్రీహరి, గంగిశెట్టి రాకేష్ వర్మ, ముఖ్య సలహాదారులు బొజ్జ సునీల్, యూనియన్ నాయకులు చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, తాటి సుదర్శన్, బిక్షపతి, గట్టి సుధాకర్, అశోక్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!