ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ లేదు

కార్మికులను హింసిస్తున్న ఇటుక బట్టీల యాజమాన్యాలు

గర్భిణీ స్త్రీలతో వెట్టి చాకిరి చేస్తున్న ఇటుక బట్టి యజమానులు

ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కమిటీ సభ్యులు పసుల వినయ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండల కేంద్రంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులను వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకొని ఇటుక బట్టీల యాజమాన్యాలు శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికులను అడ్డగోలుగా పనిలో పెట్టుకొని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు పనిచేయకపోతే రూముల్లో బంధించి చిత్రహింసలు పెడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం
రేగొండ మండలంలో చెన్న పూర్ గ్రామ శివారు ప్రాంతం లోని ఇటుక బట్టీలు నడిపిస్తున్న యాజమాన్యాలు కార్మికులకు రక్షణ కల్పించకపోవడం ఎలా.? కార్మికులను అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ తెచ్చుకొని పని చేయించుకుంటూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అడ్డుగోలుగా కార్మికులను పని చేయించుకుంటూ వారి శ్రమ దోపిడీకి గురి చేస్తున్న ఇటుకబట్టిల యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని అన్నారు. కార్మికులను 18 గంటలు పని చేపించుకుంటూ వారికి కనీస వేతనం అమలు చేయకపోవడం చాలా దారుణమని అన్నారు. పనిచేయకపోతే నలుగురు కార్మికులను హింసలు పెట్టి కార్మికులు పనులు చేయించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న ఇటుక బట్టీల యాజమాన్యాలపై చర్య తీసుకోకపోవడం చాలా దారుణం . జిల్లా అధికారులు వెంటనే ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కల్పించి యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కమిటీ సభ్యులు పసుల వినయ్ కుమార్ డిమాండ్ చేశారు చిన్న చిన్న పిల్లలతో పనిచేస్తున్న వారికి రక్షణగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అనేక రోజుల నుండి పనులు చేస్తున్న కనీస నివాసం కల్పించక పోవడం స్నానం చేసేందుకు బాత్రూములు లేకపోవడం ఇటుక పై ఇటుక పేర్చి చిన్న గృహంలో పై కప్పు తాటి కమ్మలతో పేర్చిన గృహంలో ఉంచుతూ వారిని హీనంగా చూస్తున్నారు .వారికి సంబంధించిన అవసరాలు తీర్చే రక్షణ యజమానులు కానీ విద్య వైద్యం లాంటి అవసరాలు తీర్చాలి .కని అవేమీ పట్టించుకోకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు.ఇంత జరుగుతున్నా కార్మిక వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది పరకాల భూపాల్ పల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఇటుక బట్టిలో పని చేస్తున్న కార్మికులు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.వెంటనే సంబంధిత అధికారులు జిల్లా అధికారులు ఇటుక బట్టీల యాజమాన్యాల పైన క్రిమినల్ కేసులు పెట్టి కార్మికులకు రక్షణ కల్పించాలనిప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *