
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్మిక శాఖలో 23 24 సంవత్సరంలో 5582 కార్మికుల భావన ఇతర నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకున్నారని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద తెలిపారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు లబ్ధి పొందిన కార్మికుల వివరాలు వివాహ బహుమతి 156 మంది రూపాయలు 46.85.928/ ప్రసూతి ప్రయోజనం 384 మంది రూపాయలు 1.15.34.592/ సహజ మరణం ఉపశమనం అంత్యక్రియలు ఖర్చులు 94 మంది మంజూరు కాబడిన నిధులు రూపాయలు 1.24.83.648/
ప్రమాదశాస్తు మరణం ఉపశమనం అంత్యక్రియలు ఖర్చులు 12 మంది మంజూరు కాబడిన నిధులు 75.60.456/ ఆసుపత్రిలో చేరి ఉపశమనం చెందినవారు 12 మంది మంజూరు కాబడిన నిధులు 2=70.760/ రూపాయలు మొత్తం జిల్లాలో 668 మంది లబ్ధి పొందినారు మంజూరు కాబడిన నిధులు రూపాయలు 3.65.35.384/ అని తెలిపారు
భవన నిర్మాణ కార్మిక కార్డు
లేబర్ కార్డు యొక్క ప్రయోజనములు
వివాహ కానుక మహిళ కార్మికురాలి వివాహం కార్మికులకు ఇద్దరు కుమార్తెల వివాహం సందర్భంగా ఒక్కొక్కరికి 30000 కానుకగా ఇవ్వబడును
ప్రసూతి సహాయం మహిళా కార్మికురాలకు కార్మికునికి భార్యకు. కార్మికుల ఇద్దరు కుమార్తెలకు ఒక్కొక్కరికి 30,000 ఇవ్వబడును
ప్రమాదశాస్తు మరణించిన కార్మికుని కుటుంబ సభ్యులకు రూపాయలు 6 లక్షలు అంత్యక్రియల నిమిత్తం ముప్పై వేయిలు మొత్తం 6 లక్షల 30000 ఆర్థిక సహాయం అందజేయబడును
సహజంగా మరణించిన కార్మికుని కుటుంబ సభ్యులకు ఒక లక్ష అంత్యక్రియలకు నిమిత్తం 30 వేయిలు మొత్తం ఒక లక్ష 30 వేలు ఆర్థిక సహాయం అందజేయబడింది
ప్రమాదశాత్తు పూర్తి శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూపాయలు 5 లక్షలు ఆర్థిక సహాయం అందజేయబడును
ప్రమాదశాత్తు పాక్షిక శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయబడును
ఎంప్లాయిస్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం అంగవైకల్యం శాతాన్ని బట్టి ఆర్థిక సహాయం అందజేయబడును
అని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద తెలిపారు