Workers Demand Cancellation of CSC Health Tests
సి ఎస్ సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలి
జీవో నెంబర్ 12 ను సవరించి కార్మికుల వెల్ఫేర్ నుండే సంక్షేమ పథకాలు అందించాలి
భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
కరీంనగర్, నేటిధాత్రి:
తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు జేఏసీగా అనుబంధ సంఘాలతో జేఏసీ రాష్ట్ర పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈసందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిట్టల సమ్మయ్య, ఎడ్ల రమేష్, ఆకుల మల్లేశం మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని జీవో నెంబర్12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికుల అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి అక్రమంగా వెల్ఫేర్ బోర్డు నిధులు మూడు వందల నలభై ఆరు కోట్లు ప్రైవేటు భీమా కంపెనీలకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ క్లైములకు వెంటనే నిధులు విడుదల చేసి అరవై సంవత్సరాలు పైబడిన కార్మికునికి ఐదు వేల పెన్షన్ వెంటనే ఇవ్వాలన్నారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించి 2009 నుండి రెన్యువల్ కానీ పన్నెండు లక్షలకు పైగా ఉన్నా లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలని పేర్కొన్నారు. మీసేవలో అధిక డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేబర్ అడ్డాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అమలు చేయని యెడల డిసెంబర్ 5న చలో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన హక్కులను కాపాడుకోవాలని పిట్టల సమ్మయ్య, ఎడ్ల రమేష్, ఆకుల మల్లేశంలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈధర్నా కార్యక్రమంలో బిఓసి అధ్యక్షులు గందె కొంరయ్య, గౌరవ అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేగుల కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, కన్నం సదానందం, గోదారి లక్ష్మణ్ పొన్నం సంపత్, పుట్ట మహేష్, అందే పుల్లయ్య, గామినేని సత్యం, బొంకూరి రాములు, ఆకునురి రమేష్, ఎల్లయ్య, మోసం తిరుపతి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
