Workers Demand Safety and Welfare in Chityal Market
ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు
కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
గుంపల్లి మునీశ్వర్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రైతు భవన్ లో ఏఐటీయూసీ హమాలి యూనియన్ అవగాహన సదస్సు కార్మిక యూనియన్ అధ్యక్షులు లంకదాసర అశోక్ అధ్యక్షతనలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంపల్లి మునీశ్వర్ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన కార్మికుల పరిస్థితి మరింత అద్వానంగా ఉన్నదని ఏఐటియుసి పోరాటాలతో 50 కిలోల బస్తాలు వచ్చాయని హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వం నుండి తగిన ఆదరణ లేకపోవడం దారుణమని అన్నారు.బరువులు మోసేటప్పుడు లారీల నుండి దించేటప్పుడు ఎత్తేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని కాళ్లు చేతులు విరిగిన ప్రాణాలు పోయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఠా జట్టు హమాలీల సంక్షేమ బోర్డును పునర్దించాలని మన మార్కెట్లో దడ్వాయిలు,కాంట్రవెస్తూ అటు రైతులకు హమాలి కార్మికులకు చేదోడు వాదోడుగా
ఉంటున్నారు.మార్కెట్లో ప్రధానంగా మార్కెట్ యార్డ్ లో పనిచేసే వారందరూ రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు ఎండి చాలీచాలని ఆదాయంతో బతుకుతున్నారని అన్నారు. మార్కెట్లో పనిచేసే హమాలీ దడువాయి,గంపకూలి కార్మికులకు పని భద్రత కల్పించాలని,రైతు ప్రజా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మికులకు ప్రమాద బీమా నష్టపరిహారం మూడు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని మార్కెట్లో పనిచేస్తున్న వారందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని మరియు కార్మికులందరికీ 3000 యూనిఫామ్ ను ప్రతి సంవత్సరం ఇవ్వాలని,మార్కెట్ యార్డ్ కార్మికుల లైసెన్స్ రెన్యువల్ చేసి 58 నుంచి 60 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మార్కెట్ యార్డుల పాలకవర్గంలో కార్మికుల నుంచి ఇద్దరికీ డైరెక్ట్ గా అవకాశం కల్పించాలని యార్డులో క్యాంటీన్ మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్,ఏ ఐ టి యు సి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్,కార్మిక నాయకులు కోడే పాక ఐలయ్య,కోకిల శంకర్, కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరే రవి,ధార్వా యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్,గంపకూలి లచ్చమ్మ తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు.
