ప్రజా సేవకోసమే పని చేసిన..

# పెండింగ్ పనులు పూర్తి కావాలంటే నేను మరోసారి రావాల్సిందే..
# ప్రజల కోసం అహోరాత్రులు పనిచేసిన వ్యక్తిని..
# వేలకోట్ల రూపాయలతో నర్సంపేట అభివృద్ధి..
# వైద్య సౌకర్యం కోసం పల్లె నుండి జిల్లా ఆసుపత్రి వరకు ఏర్పాట్లు.

# నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి నేటివరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ కోసమే పనిచేస్తూ అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ వేసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దివేనలు,నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో నామినేషన్ వేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశానన్నారు.గత ఎమ్మెల్యేల పాలనలో నర్సంపేట ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు.కరోనా విపత్తు సమయంలో తనకు మూడు సార్లు కరోనా సోకి అనారోగ్యానికి గురైన కూడా ప్రజల మధ్య ఉండి సేవలందించాను తెలిపారు.నర్సంపేట పూర్తి స్థాయిలో నిధులు తెచ్చి అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాను.నియోజకవర్గంలో 360 కిలోమీటర్ల బిటి రోడ్డు, 350 కిలోమీటర్ల సిసి రోడ్లు తెచ్చిన మీ బిడ్డను నేను అని ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు.హర్టికల్చర్ పరిశోధన కేంద్రం యూనిట్, పైప్డ్ నేచురల్ గ్యాస్ తెచ్చానని మున్సిపాలిటీలో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని అలాగే నియోజకవర్గం వ్యాప్తంగా అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని కేసిఆర్ దీవెనలతో రంగాయ చెరువు, పాకాల చెరువుకు గోదావరి జలాలు తెచ్చానని పాకాల, రంగాయ చెరువు ఆయకట్టు కాలువలు డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని,అలాగే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తి అయ్యాయని మిగతా పనులు పూర్తి కావాలంటే నాతోనే సాధ్యం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.జిల్లా హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకోగా ఆసుపత్రితో పాటు ఇతర రంగాల్లోని ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దశల వారీగా సాగుతున్నాయని వారికి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో ఏనియోజకవర్గంలో లేని పైలట్ ప్రాజెక్ట్ లు తెచ్చిన ఘనత తనదే అని చెప్పారు.వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సాధించి నర్సంపేట నియోజకవర్గంలో లక్ష మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించానని అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పథకాన్ని తెచ్చామని పేర్కొన్నారు.నర్సంపేటలో మిషన్ భగీరథ ద్వారా 174 కి మీ మేర పైప్ లైన్ పూర్తికాగా డ్రైనేజ్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయని తెలిపారు.పట్టణంలో ఇంటింటికి నల్ల కనెక్షన్స్ తో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నారు.నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం కోసం అహో రాత్రులు నిద్రకు మానుకొని కేసీఆర్ పథకాలతో పాటు ప్రత్యేక నిధులతో కృషి చేసిన,చాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన వాటిని పూర్తి చేయడం నా వల్లనే సాధ్యం అవుతాయని తెలుపుతూ మరో ఒక్కసారి అవకాశం కల్పించాలని నియోజకవర్గ ప్రజలను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ వి.ప్రకాష్,జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న,ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్,నామాల సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!