
Work on Sports Development Center (Indoor Stadium) in Chandragiri is progressing at a fast pace.
*చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు…
*హర్షం వ్యక్తం చేస్తున్న చంద్రగిరి పట్టణ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు..
*అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి కృతజ్ఞతలు తెలుపుకున్న ప్రజలు…
చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 10:
పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.
1.53 కోట్లతో మంజూరైన క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పునఃనిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ క్రీడా వికాస్ కేంద్రం నిర్మాణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఊపందుకుందిభూమిపూజతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అధునాతన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే యువ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని, చంద్రగిరి క్రీడా రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.