`చెరువులన్నీ నింపింది ‘‘దేవాదుల ప్రాజెక్టే‘‘!
`దేవాదుల ఘనత ‘‘కాంగ్రెస్‘‘ పార్టీదే.

`దేవాదుల లేనిదే చెరువుల్లో చుక్క నీరు లేదు.
`‘‘కేసీఆర్‘‘ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్దాలే!

`‘‘నేటిధాత్రి‘‘ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్ర రావు‘‘ తో నీటి పారుదల శాఖ మంత్రి
‘‘ఉత్తమ్ కుమార్ రెడ్డి‘‘ చెప్పిన విషయాలు ‘‘మంత్రి గారి‘‘ మాటల్లోనే..నినిపదేళ్లు పాలన చేసింది కెసిఆర్.
`కేసీఆర్ మాటలన్నీ నీటి మూటలే!ని
`పాలమూరు మీద అంత ప్రేమ ఉంటే తొలి పనులు ఎందుకు చేపట్టలేదు?
`ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుడేందుకు?
`నీళ్ల తొలి ఫలితం పాలమూరుకు ఎందుకు కల్పించలేదు?
`6 వేల కోట్లతో పెండిరగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి?
`ఎంత మొత్తుకున్న రూపాయి విడుదల చేయలేదు.
`పదేళ్లు తట్టేడు మట్టి తీయలేదు.
`పాలమూరు పదేళ్లుగా ఎందుకు పచ్చబడలేదు?
`దేవాదుల నీళ్లతో చెరువులు నింపి కెసిఆర్ చెప్పుకున్న గొప్పలు.
`పాలమూరులో పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే సగం జిల్లా బాగుపడేది!
`మిషన్ కాకతీయ పేరుతో చెరువుల మారమ్మత్తులకు రెండు లక్షల కోట్లు ఖర్చు చేశారు
`పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే పనికి పనికిమాలిన ఖర్చులు చేశారు.
`చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు?
`చెరువులన్నీ నింపింది దేవాదుల.
`దేవాదుల నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
`తెలంగాణలో సగానికి పైగా చెరువులు నింపింది దేవదుల.
`తుపాకుల గూడెం నుంచి తపాసు పల్లె దాకా నీళ్లు ఇచ్చేది దేవదుల.
`మధ్యలో అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ.
`వరంగల్ నుంచి తప్పాస్ పల్లె దాకా పదుల సంఖ్యలో కొత్త రిజర్వాయర్లు నిర్మాణం చేయడం జరిగింది.
హైదరాబాద్, నేటిధాత్రి:
పదేళ్లు పాలన చేసి, పాలమూరుకు న్యాయం జరగడం లేదని కేసిఆర్ మాట్లాడడం వింతగానే కాదు, విడ్డూరంగా వుంది. చిత్రమైన మాటలు మాట్లాడి కేసిఆర్ మసిబూసి మారేడు కాయ చేయాలని చూడడం వికారంగా వుంది. పాలమూరుకు తాను కూడ న్యాయం చేయలేకపోయానని కేసిఆర్ చెప్పుకుంటూ హుందాగా వుండేది. కాని ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని పాత లెక్కలు చెప్పే ముందేసుకొని కేసిఆర్ చెప్పిన కొత్తలేమిటి? ఆయన పెంచిన ఆయకట్టు ఏమిటి? పాలమూరుకు జరిగిన అభమేమిటి? మళ్లీ ఇప్పుడు మేలుకొని ఏమైపోతుందని మొసలి కన్నీరు కారిస్తే జనం నమ్మడానికి సిద్దంగా లేరు. పాలమూరు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయమే కేసిఆర్ హయాంలోనూ జరిగింది. అందుకు పశ్చాత్తాపడాల్సిందిపోయి, కాంగ్రెస్ మీద రాళ్లేసి రాజకీయం చేయాలనుకోవడం తగదు. పాలమూరు వలసల జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి నిర్లక్ష్యానికి గురింది. అంతకు మించి దక్షిణ తెలంగాణను ఆగం చేసింది కేసిఆర్ కాదా? నిజానికి కేసిఆర్ ముందుగా ఏదైనా పని చేయాలనకుంటే అది పాలమూరు నుంచి మొదలు పెట్టి వుండాలి. కాని ఆ పని చేయలేదు. పాలమూరును గాలికొదిలేశారు. పెండిరగ్ ప్రాజెక్టులను పక్కన పెట్టేశారు. పదేళ్ల కాలంలో కనీస పాలమూరు, దక్షిణ తెలంగాణ పెండిరగ్ ప్రాజెక్టులకు మొదటి ప్రాదాన్యత కల్పించాల్సి వుండే. కాని ఏం చేశారు. పాలమూరుకు పైసా ఖర్చు పెట్టలేదు. పలుగు రాళ్లను చూసి కూడా కేసిఆర్ మనసు కరగలేదు. పదేళ్లు అదికారంలో వున్నప్పుడు పాలమూరుకు నీళ్లియ్యాలన్న సోయి రాలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నిజం చెప్పాలంటే నీళ్లు విషయంలో మొదటి అడుగు పాలమూరు నుంచి పడాలి. కాని పడలేదు. తెలంగాణలో ఒకప్పుడు మూడు లక్షల చెరువులు వుండేది. కాలక్రమంలో అవి సుమారు 46వేలకు పడిపోయాయి. అందులో తెలంగాణ వ్యాప్తంగా 12వేల గొలుసుకట్టు చెరువులున్నాయి. వాటికి ఎలాంటి కాలువలు అవసరం లేదు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీళ్లు వెళ్లే వెసులుబాటు ఎప్పటి నుంచో వుంది. తెలంగాణ వ్యాప్తంగా సాగిన మిషన్‌కాకతీయలో భాగంగా పాలమూరు చెరువులు బాగు చేశారు. అంతే కాని ప్రత్యేకంగా అన్ని ప్రాంతాలకంటే ముందు చేయలేదు. కృష్ణా నదిమీద వున్న పెండిరగ్ ప్రాజెక్టులన్నీకలిపి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోయేది. సుమారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరు లక్షల ఎకరాలు సాగయ్యేవి. చెరువులు కూడా ఆ నీళ్లతోనే నిండేవి. అదనపు ఆయ కట్టు వచ్చేది. కాని ఆ పని చేయలేదు. పాలమూరు జిల్లా ప్రజలు ఎంత మొత్తుకున్నా కనీసం ఆరు వందల కోట్లు కూడా ఇవ్వలేదు. ఆఖరుకు ఎన్నికల ముందు పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే పాలమూరు పాల నురగలా మారిపోయేది. కాని ఆ పని చేయలేదు. కాలేశ్వరం మొదలు పెట్టి కమీషన్ల ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. అంతకు ముందు మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణలోవున్న 46వేల చెరువుల మరమ్మత్తుల పేరుతో సుమారు 2లక్షల కోట్లు ఖర్చుచేశారు. కాని కొత్త చెరువులేమీ తవ్వలేదు. పాత చెరువులకు పూర్వ వైభవం తెచ్చింది కాదు. కేవలం కొంత మట్టి తీసి చేతులు దులుపుకున్నారు. కమీషన్ల కోసం రెండు లక్షల కోట్లు నీళ్లపాలు చేశారు. అసలు తెలంగాణలో సగానికి పైగా చెరువులు నిండడానికి ప్రదాన కారణం దేవాదుల. ఆ దేవాదుల నిర్మాణం చేసిందికాంగ్రెస్ పార్టీ. కాని విషయం చెప్పకుండా చెరువులు నింపామని గొప్పలు చెప్పుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు లేకుండా తెలంగాణలోని సగం చెరువులు నిండేవా? ఎక్కడికెళ్లినా అవి కాళేశ్వరం నీళ్లని ప్రచారం చేసుకున్నారు. కాని దేవాదుల నీళ్లుని చెప్పలేదు. దేవాదుల నీళ్లని చెప్పితే క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని అబద్దాలు ప్రచారంచేశారు. కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లికి ఎత్తిపోయడం. వానలు పడగానే మళ్లీ ఆ నీటిని కాళేశ్వరానికి వదిలేయడం. అక్కడి నుంచి వచ్చిన నీటిని దేవాదుల ద్వారా సరఫరా చేశారు. జనాన్ని మాయ చేసి మభ్యపెట్టారు. తుపాకుల గూడెం నుంచి సిద్దిపేట జిల్లా తపాసు పల్లి వరకు కొన్ని వందల కిలోమీటర్ల దూరం గోదావరిని నీళ్లను దేవాదుల ద్వారా తరలింపు భగీరథ ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కొన్ని వందల కిలోమీటర్ల మేర రైతులకు ఇబ్బందులు లేకుండా భూ గర్భం గుండూ పైపులు వేసి, నీళ్లను తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ క్రమంలో తుపాకుల గూడెం నుంచి మొదలు అన్ని పాత చెరువులకు నీళ్లు వచ్చేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. దేవాదుల ప్రాజెక్టు నుంచి తపాసు పల్లి వరకు పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మాణం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా దేవాదుల నీళ్లను చెరువులకు అనుసందానం చేస్తూ, రిజర్వాయర్లు నింపుతూ ఆఖరుకు తపాసు పల్లి వరకు గోదావరి నీళ్లు చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దేవాదుల నిర్మాణ సమయంలో అక్కడకడ్క భూగర్భంలో వున్న పైపులు లీకైతే పటాకులు పేలినట్లు పెలుతున్నవని ఆనాడు ఇదే కేసిఆర్ పదే పదే అబద్దాలు ప్రచారం చేశారు. ఏ ప్రాజెక్టు నిర్మాణ సమమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుంటాయి. కాని తర్వాత కాలంలో పదేళ్ల కేసిఆర్ హయాంలో ఎక్కడా ఒక్క పైపు కూడా పేలకుండా దేవాదుల నీళ్లు పైపుల ద్వారా పారాయి. కేసిఆర్ నిర్మాణం చేసిన కాలేశ్వరంలో గుండెకాయ లాంటి మేడిగడ్డ కుంగిపోయింది. తర్వాత సుందిళ్లలో బుంగలు పడ్డాయి. ఆఖరుకు నిర్మాణం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు పనికే రాకుండాపోయింది. అదే దేవాదుల పూర్తయి ఇంత కాలమైనా మరమ్మత్తులు కూడా రాలేదు. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, కేసిఆర్ చేసిన అవినీతికి నిదర్శనం. ఆఖరుకు ఇప్పటికీ దేవాదుల నీళ్లే దిక్కవుతున్నాయే గాని కాలేశ్వరం నుంచి నీళ్లు వచ్చింది లేదు. తెలంగాణకు పారింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసిఆర్ ఏం తక్కువ చేసినట్లు. కృష్ణా నది జలాల మీద మొసలి కన్నీరు కార్చుతున్న కేసిఆర్ కాలంలో పోతిరెడ్డి పాడులో ఏపి ప్రభుత్వం 45 క్యూసెక్కుల నుంచి 80 క్యూసెక్కులను తరలించేంత పెద్ద పొక్క పెట్టిలేదా? అప్పుడు కేసిఆర్‌కు నోరు రాలేదా? తిరుపతికి వెళ్లి అప్పటి ఓ నాయకురాలి ఇంటిలో భోజనం చేసిన తర్వాత రాయలసీమకు నీళ్లివ్వాలన్నప్పుడు, పాలమూరు గుర్తుకు రాలేదా? ఓ వైపు పాలమూరుకు చుక్క నీరు లేక తండ్లాడుతుంటే ఏపికి నీళ్లను ఇస్తామని చెప్పింది కేసిఆర్ కాదా? ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీఎస్ తూముల ముచ్చట గుర్తున్న కేసిఆర్‌కు పోతిరెడ్డి పాడుకు పొక్క పెద్దది చేస్తున్నప్పుడు కనిపించలేదా? పోతిరెడ్డి పాడుకు వెళ్లకుండా నీళ్లను అడ్డుకోవాలన్న ప్రయత్నం ఏనాడైనా చేశారా? పైగా గోదావరి నీటిని కృష్ణాకు అనుసంధానం చేసి, ఏపికి నీళ్లివ్వాలన్న ప్రతిపాదన కేసిఆర్ చేసిందే కదా? ఇప్పుడు కేసిఆర్ పెడబొబ్బలు పెడితే సరిపోతుందా? గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు, ప్రజలకు ఈ వషయాలు చెప్పడం వల్లనే కేసిఆర్‌ను ఓడిరచారు. నీళ్ల ముసుగులో కేసిఆర్ తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నట్లు గమనించే ప్రజలు ఓడిరచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపికి నీళ్లివాలన్న ఆలోచన ఒక్కనాడు కూడా చేయలేదు. కాని లేనిపోనివి కేసిఆర్ ప్రచారం చేయాలని చూసిన తెలంగాణ ప్రజలు నమ్మలేదు. పదేళ్ల తన పాపం ఎన్ని జన్మలెత్తి కుడుకున్నా పోదు… కాళేశ్వరం మొదలుపెట్టిన నాడే పాలమూరు, రంగారెడ్డి ఎందుకు మొదలు పూర్తి చేయలేదు. మిషన్ కాకతీయలో నాలుగోవంతు ఖర్చు చేసినా పాలమూరు. రంగారెడ్డి పూర్తయ్యేది. ఇరవై ఏడు వేలు ఖర్చు చేశామంటూ లెక్కలుచెప్పడం కాదు, కాలువలు తీసి నీళ్లివ్వలేదు. పాలమూరును పూర్తి చేయాలన్న చిత్తశుద్ది ప్రదర్శించలేదు. కాళేశ్వరం కాకుండా తుమ్మిడి హట్టిలో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే గ్రావిటీ ద్వారా తెలంగాణ మొత్తానికి నీళ్లు అందేవి? ఈ డొంక తిరుగుడు ఖర్చుంతా వుండేదికాదు. తెలంగాణ ఖజనాకు ఈ బారం పడి వుండేది కాదు. నీళ్ల లభ్యత పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మంతా కాళేశ్వరంలో పోసి కమీషన్లు నింపుకున్నారు. వాన నీటిని, వరద నీటి కూడా కాళేశ్వరం నీరని చెప్పు కొని ప్రజలను మాయ చేశారు. మభ్యపెట్టి పదేళ్లుపాలించారు. తుమ్మిడి హెట్టి కడితే ఖర్చు సగం మిగిలేది. తెలంగాణ అప్పుల పాలు కాకపోయేది. ఏటా పదహారు వేల కోట్లు మిత్తిలు కట్టే పరిస్దితి రాకుండా వుండేది. తెలంగాణ రాష్ట్ర ఆర్దిక పరిస్తితి మెరుగ్గా వుండేది. మరన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే వీలయ్యేది.
