హోలీ సంబరాల్లో మహిళా మణులు
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని షిర్కే కాలనీలో మహిళా మణులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.ముందుగా మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.అలాగే చెడుపై మంచి విజయం సాధించినందుకు వసంత రుతువు శోభతో ప్రకృతి పులకించేవేళ సమాజంలో సాఖ్యాతను పెంచుతూ అందరూ కలసి మెలసి ఉండాలని చెప్పే హోలీ పండుగను మహిళలు అందరూ కూడా సంతోషంగా శుక్రవారం జరుపుకున్నారు.హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకొని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు ఈ సందర్భంగా కోరుకున్నారు.