
Ashada
సందడిగా మహిళల గోరింటాకు వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
ఆషాడ మాసం పురస్కరించుకొని భూపాలపల్లి ఏరియాలోని ఇల్లందు క్లబ్ లో గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఏరియా సింగరేణి సేవా లేడీస్ క్లబ్ ఆధ్యక్షురాలు ఏనుగు సునీత రాజేశ్వర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు అందరికీ పండుగ వాతావరణం లో గోరింటాకు పోటీలను నిర్వహిచడం జరిగింది . ఈ గోరింటాకుపోటీలలో విజేతలు అయినవారికి బహుమతులను సేవ ఆధ్యక్షురాలు చేతులమీదుగా ప్రధానం చేశారు.ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుందని, ఒంట్లోని వేడిని తగ్గిస్తుందని, గోరింటాకు అనేది సాంప్రదాయకంగా, సౌందర్య సాధనంగా, అలాగే ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు కలిగి ఉందని గోరింటాకు జుట్టుకు బలాన్ని ఇవ్వడానికి, చుండ్రును తగ్గించడానికి ఉపయోగపడుతుందాని, ఆషాడ మాసం లో గోరింటాకు అలంకరణ తెలుగు వారి సంప్రదాయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.