సింగరేణి ఆద్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

మందమర్రి, నేటిధాత్రి:-

సింగరేణి ఆధ్వర్యంలో పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో గురువారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జిఎం ఏ మనోహర్, సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్, సింగరేణి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి అడిషనల్ సిఎంఓ డాక్టర్ ఉష లు ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వల చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి, ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సత్కరించి, అనంతరం మహిళ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందుగా సింగరేణి మహిళ కార్మికులకు, అధికారిణులకు, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారని, ఎక్కడ స్త్రీలు అగౌరవపరచబడతారో అక్కడ ఎంతటి గొప్ప సత్కార్యాలైన ఫలించవన్నారు. నేటి సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఎదుర్కోవాలంటే మహిళలు తమ తమ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. సింగరేణి సంస్థ సింగరేణి ఉద్యోగుల భార్యా పిల్లలకై కాకుండా చుట్టుపక్కల గ్రామాల మహిళలకు టైలరింగ్, బ్యూటిషన్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ వంటి వృత్తి శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుందని, శిక్షణ పొందిన చాలా మంది మహిళలు సొంత యూనిట్లను ఏర్పాటు చేసుకొని, ఉపాధి పొందుతున్నారన్నారు.మహిళలను ప్రోత్సహించడంలో సింగరేణి సంస్థ ఎప్పుడు ముందుంటుందన్నారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఐ అండ్ సిఏడి మాజీ డివై ఇంజనీర్ వై శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన సాంస్కృత ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎస్ రమేష్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డివైపిఎం ఎండి అసిఫ్, జిఎం కార్యాలయ మహిళ సిబ్బంది, లేడీస్ క్లబ్, సేవా సమితి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *