జ్ఞానోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని లీగర్ లీటరసి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
మెట్ పల్లి మార్చి 8 నేటి ధాత్రి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరరావు హాజరయ్యారు.
అనంతరం సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని భారత దేశ న్యాయస్థానం మహిళలకు ఉద్యోగులలో రాజకీయాలలో అన్ని రంగాలలో రిజర్వేషన్ ఇచ్చిందని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మహిళలకు మన భారత దేశంలో ప్రాధాన్యత ఇస్తారని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని వివిధ రంగాల ఉద్యోగాలలో ముందుగా పురుషులకంటే మహిళలు ఉద్యోగం సాధించి మంచి గుర్తింపు పొందుతున్నారని వారికి మరిన్ని ఉపయోగ ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ప్రోత్సాహక వ్యాపారాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని గుర్తింపు వీటిని మహిళలు మంచి లబ్ధి పొందుతున్నారని మీకు ఏ న్యాయ సలహా కావాలన్నా మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుపాలని దానికి మేము పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు సామాన్య గృహిణిగా ఉన్న సాధారణ మహిళ చిరు పట్ట గొలుసుల తయారు చేసే వ్యాపారము ప్రారంభించి ఉన్నత వ్యాపార స్థానం చేరిన గృహిణి ని మరియు సీనియర్ మహిళ అడ్వకేట్లను ఘనంగా సన్మానం చేశారు .
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి నాగేశ్వరరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, టి వేణుగోపాల్ ,మగ్గిడి నరసయ్య ,కోటగిరి వెంకటస్వామి, ప్రిన్సిపాల్ సంతోష్ ,తెడ్డు సురక్ష, దయ రాజారామ్, తుల రాజేందర్, ఓజ్జల శ్రీనివాస్ ,గడ్డం శంకర్ రెడ్డి, అలల శంకర్, తదితరులు విద్యార్థిని విద్యార్థులు అడ్వకేట్లు అధ్యాపకులు పాల్గొన్నారు.