మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం
పరకాల నేటిధాత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామంలో శనివారం రోజున ఉపాధి హామీ పని వద్ద గ్రామ మహిళలంతా ఒక్కచోట చేరి మహిళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.అనంతరం మహిళలు కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.