నస్పూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం షిర్కే కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి వినాయక మండపంలో కుంకుమ పూజ చేయడం జరిగింది. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహికంగా గౌరీ పూజ చేశారు. కుటుంబ సభ్యులు మరియు కాలనీవాసులు అందరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతిని కోరుకున్నారు. చాలా సంవత్సరాల నుండి వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ లక్ష్మీ గణపతి వినాయక మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నవరాత్రుల పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు ఒక లక్కీ డ్రా ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆలయ కమిటీ తెలియజేశారు.