
Women
భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసినమహిళలకు సత్కారం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసిన మహిళలకు సిరిసిల్ల గీతా ప్రచార సేవ సమితి ఘన సత్కారం గీతాశ్రమంలో ఉదయం 11 గంటలకు కోడo నారాయణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్య నిర్వహణలో జరిగిన సమావేశంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమం మైసూర్ లో నిర్వహించిన 700 శ్లోకాల కంఠస్థం చేసిన నార్ల సంతోషి, కటకం లక్ష్మి, కటకం విజయ ,జి సంగీత, జి ప్రశస్తి, మహిళలకు బంగారు పతకం శాలువాతో సత్కారం పొందిన సిరిసిల్ల జిల్లా వాసులలో ముగ్గురు సిరిసిల్ల లోకల్ వారైతే ,ఆవునూరు వారు ఇద్దరూ ఒకే ఇంటి కుటుంబానికి చెందిన వారై తల్లి, కూతురు ఈ అవార్డులు పొందడం విశేషం. మహిళలకు.డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ విశేషంగా భగవద్గీత అంటే అర్థం పరమార్థం తెలిసిన ఈ ఐదుగురిని సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ఘనంగా గీత ఆశ్రమంలో ఉదయం సన్మానించింది వీరికి శాలువా గ్రంథాలతో ఘనంగా నారాయణ నందగిరి స్వాముల చేతుల మీదుగా సన్మానించింది. భవిష్యత్తులో భావితరానికి భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయించాల్సిందిగా గీత ప్రచార సేవా సమితి కోరింది. ఈ కార్యక్రమంలో గీత గజ్జెల్లి రామచంద్రం, మెరుగు మల్లేశం, కమలాకర్, మోర దామోదర్, కొక్కుల రాజేశం, గడ్డం కౌసల్య, అనసూయ, పత్తిపాక హరికిషన్ మొదలైన వారు సుమారు వందమంది దాకా పాల్గొన్నారు.