Respect Women in Serials and Web Series: Nara Lokesh
సీరియళ్లు, వెబ్ సిరీస్లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్
మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.
మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతి వేదికగా లోకేశ్ మాట్లాడారు.
