
శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు
భద్రాచలం నేటి ధాత్రి
దిశా ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ
ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం తీసుకొస్తున్న పథకాలను అందిపుచ్చుకోవాలని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు కోరారు. మల్లవరం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది పేద మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ బివి రాజు జాతీయ ఉపాధ్యక్షురాలు కళ్యాణి ల ఆదేశానుసారం అనేక బహుమక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పట్టణంలో ఒంటరి మహిళలు వెనుకబడిన మహిళలకు కావలసిన ఇంద్ర మహిళలు పెన్షన్లు దిశా కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే మంజూరు చేపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మీ మాట్లాడుతూ దిశా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక బహుమక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ప్రతి సంవత్సరం దసరాకి బతుకమ్మ ఉత్సవ నిర్వహించి పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దిశా ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమం నిర్వహించేందుకు జాతీయ చైర్మన్ బివి రాజు ఉపాధ్యక్షురాలు కళ్యాణి ఇలా నేతృత్వంలో సిద్ధమవుతున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షురాలు స్రవంతి తదితరులు పాల్గొన్నారు