Zero-Interest Loans Boost Women’s Development
వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు
జైపూర్,నేటి ధాత్రి:
ప్రభుత్వం మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీలేని రుణాల పథకం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు అన్నారు.మంగళవారం జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో చెన్నూర్ నియోజకవర్గంలోని మండలాల తహసిల్దార్ లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యాపార రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,మహిళ సంఘం ప్రతినిధి మాలతి, మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
