TRP Leader Questions Congress on Women Empowerment
కాంగ్రెస్ నాయకులకి “మహిళ సాధికారత”
◆:- అనే పదాలకి అర్థం తెలుసా అని ప్రశ్నిస్తున్న – టిఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి;
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి “మహిళా సాధికారత” లేదా “మహిళల సాధికారత” అనే పదాలకి అర్థం తెలుసా అని అడుగుతున్నాను.
నేను బీజేపీ లో ఉన్నప్పుడు బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కి పిలుపునిచ్చినప్పుడు, మీ రేవంత్ రెడ్డి ఆడపిల్లలకు భయపడి రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోలీసు వాళ్లని ఇండ్ల మీదికి పంపించి నైటీల పైన ఉన్న మహిళలని బజార్లోకి తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. అలాగే నేను వ్యక్తిగత పనిమీద హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు నేనున్న అపార్ట్మెంట్ లొకేషన్ ట్రేస్ కాకపోయినా చాలా ఇబ్బందులు పడి గంటసేపు ట్రేస్ చేసి నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే పోలీసు వాళ్లని నా బాత్ రూమ్ వరకి పంపించి అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించిన గొప్ప చరిత్ర మీ రేవంత్ రెడ్డికి, మీ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది.
మీ కాంగ్రెస్ వాళ్లు అరెస్టులతోనే ఆగకుండా, రోజంతా తినడానికి తిండి పెట్టకుండా, వాష్ రూమ్ కి వెళ్తే కూడా ఒక లేడీ కానిస్టేబుల్ ని బాత్రూం వరికి పంపించి హరాస్మెంట్ చేసిన చరిత్ర కూడా మీ కాంగ్రెస్ వాళ్లకే దక్కుతుంది.
రాష్ట్రంలో తల్లికి, చెల్లికి, ఆలి కి తేడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి హత్యాచారాలు చేస్తుంటే, దేవతా విగ్రహాల చీరలు లాగుతుంటే కట్టడి చేయలేకపోయింది మీ అసమర్థతప్రభుత్వం.
ఒక పక్క రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు చేస్తూ మీ రేవంత్ రెడ్డి మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నాము అని నిన్న కొడంగల్ ప్రెస్ మీట్ లో నీతి మాటలు మాట్లాడుతుంటే “దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది”.
ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ నాయకుల అనుచరులు తప్ప తాగి ఒళ్ళు మరిచిపోయి రాత్రి ఒంటిగంటకు ఫోను చేసి గొడవ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకొక తాగుబోతు ఒళ్ళు మర్చిపోయి రాత్రి 12 గంటలకు, పెళ్లయిన, పెళ్లి కాని మహిళలకు “ఐ లవ్ యు” “ఐ లవ్ యు” అంటూ మెసేజ్లు పెట్టడం జరిగింది, అలాగే షేకాపూర్ లో జరిగిన ఉరుస్స్ కి హాజరై తిరిగి వస్తున్న మహిళలు ట్రాఫిక్ లో చిక్కుకు పోవడం జరిగింది, ఆ మహిళలకు సహాయం చేయాల్సింది పోయి వాళ్ళని చూసి వెక్కిరి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోయారు కాంగ్రెస్ నాయకులు.
మహిళల పట్ల ఏ కోశానా కూడా సంస్కారం లేని మీ కాంగ్రెస్ నాయకులు మహిళల గురించి గానీ మహిళల సాధికారత గురించి మాట్లాడుతుంటే “మేడి పండు చూడు మేలిమై యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు” అనే మాటలు మీకు చాలా కరెక్ట్ గా సెట్ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
జహీరాబాద్ నియోజకవర్గంలో స్వయం సహాయక గ్రూపుల మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు కింద ఉన్న అంశాల పైన స్పష్టతనివ్వాలి.
1. స్వయం సహాయక మహిళలకి కాకుండా ఇతర మహిళలకి చీరలు పంపిణీ ఎందుకు చేయడం లేదు?
2. చీరల పంపిణీలు, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల మహిళలు సాధికారత ఎలా సాధిస్తారో చెప్పాలి?
మహిళలకి తులం బంగారం మరియు స్కూటీ లని ఇస్తామని అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం చీరలతో సరి పెట్టడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల మనోభావాన్ని దెబ్బతీసేలాగా చిన్నచూపు చూస్తుందని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.
మహిళలకు పండగలకి చీరలు ఇవ్వకుండా ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండా స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లని దండుకోవడానికి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత పేరుతో మహిళలని మోసం చేస్తున్న దగాకోరు ప్రభుత్వం అని మహిళలు తెలుసుకోవాలి.
