పుర కమిషనర్ మురళీకృష్ణ
రామకృష్ణాపూర్, మార్చి 07 ,నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి టాగూర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని మహిళలకు క్రీడ పోటీలు గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను మునిసిపాలిటి చైర్ పర్సన్ జంగం కళ, కమిషనర్ ఎన్ మురళీకృష్ణ ప్రారంభించారు. మహిళలకు కబడ్డీ, తగ్గఫర్, మ్యూజికల్ చైర్ , లెమన్ స్పూన్ ఆటలు నిర్వహించారు. కబడ్డీ పోటీలలో కే. పూజిత ప్రథమ స్థానం, పీ. స్వప్న ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. తగ్గఫర్లో జి స్వప్న (ఆర్పి) ప్రథమ స్థానం, రమాదేవి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. మ్యూజికల్ చైర్ లో పి. స్వప్న ప్రధమ, డి. శారద ద్వితీయ, ఎస్. మమత తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. లెమన్ స్పూన్ గేమ్ లో కే. స్రవంతి ప్రథమ, పి. అనూష ద్వితీయ, ఎం అనిత తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మున్సిపల్ చైర్పర్సన్ జంగం కల, కమిషనర్ ఎన్ మురళీకృష్ణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నారని, సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి,కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు, ఆర్పీలు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.