తప్పుడు సర్టిఫికేట్ తో రుణం పొందిన మహిళకు జైలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
తప్పుడు కుల ధ్రువపత్రంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 5 లక్షల సబ్సిడీ రుణం పొందిన మంచిర్యాల పట్టణానికి చెందిన చిలుకమర్రి రాధకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిరోషా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించారు.ఈ విషయాన్ని సిఐ ప్రమోద్ రావు శనివారం తెలిపారు.రాధ నకిలీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం సృష్టించి రుణం పొందినట్లు రెవెన్యూ,బ్యాంక్ అధికారుల విచారణలో తేలినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
