మహబూబ్ నగర్/నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉరేసుకుని మహిళ మృతి చెందింది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కందన్పల్లి గ్రామానికి చెందిన నారమ్మ (32) అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలకు బాత్రూంకు వెళ్లి తిరిగి రాలేదు. అనుమానం వచ్చి బంధువులు బాత్రూంలోకి వెళ్లి చూడగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి డ్యూటీలో ఉన్న నర్సు, నారమ్మను దుర్భాషలాడిందని, అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.