
నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ లోని ఓల్డ్ సిటీ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి బేస్ బాల్ పోటీలలో విజ్ డమ్ హైస్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థులు నైపుణ్యాన్ని కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుండి 16 వరకు నిర్మల్ జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో 10వ తరగతికి చెందిన జయంత్, సల్మాన్ 9వ తరగతికి చెందిన రాణి, గౌతమి లు పాల్గొననున్నట్లు జిల్లా బేస్ బాల్ సెక్రటరీ ముఖర్జీ తెలిపారు.
కేవలం చదువే కాకుండా క్రీడలకు ప్రాధాన్యన్యత నిచ్చినప్పుడు విద్యార్థులు మంచి క్రీడాకారులుగా ఎదుగు గలుగుతారని పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్ గారు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ జావేద్, అకాడమిక్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీమ్ సుల్తాన, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, కోచ్ ప్రశాంత్ కుమార్, పిఈటీ లు రియాజుద్దీన్, రాజేష్, పృధ్వీ, వీరభద్రయ్య, మధు, మంజుల, శ్రీలత, రాజేష్ లతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.