Illegal Multi-Storey Constructions Raise Concerns in Shabad
అనుమతులేకుండా…ఆరంతస్థులు
* అనుమతికి మించి భారీ బహుళ అంతస్తులు
* సెట్బ్యాక్వదలకుండా..డొమెస్టిక్ పర్మిషన్తో జోరుగా కమర్షియల్ నిర్మాణాలు
* పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్న వైనం
* మెండుగా అధికార పార్టీ నేతల అండదండలు
* నోటీసులతోనే సరిపెడుతున్న పంచాయతీ అధికారులు
* అక్రమాలు అధికారుకు కాసులు కురిపిస్తున్నాయన్న విమర్శలు.
నేటిధాత్రి, చేవెళ్ల :
షాబాద్ మండలంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని.. అనుమతులు లేకుండా మరికొన్ని అడ్డూఅదుపు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మండలంలో అక్రమనిర్మాణాలు కొనసాగుతుంటే .. నిద్రవస్థలో జోగుతున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు. జీపీలలో ఇండ్ల నిర్మాణాలు, అనుమతులను గ్రామపంచాయతీ మానిటర్ చేస్తుంది. పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వారే కరువయ్యారంటే గ్రామపంచాయతీలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనుమతుల మేరకే నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా అని అధికారులు పరిశీలించడం లేదు. ఇక అనేకచోట్ల భవనాలు పూర్తయినా అధికారులు అసెస్మెంట్ చేసి.. ఇంటి నంబర్లు కేటాయించడం లేదు. అక్రమ కట్టడాలు గుర్తించకపోవడం, పూర్తయిన నిర్మాణాలకు అస్సెస్మెంట్ చేయకపోవడంతో గ్రామపంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. కొన్ని సందర్భాల్లో గ్రామపంచాయతీలలో అధికారులకు ఫిర్యాదులు వెళ్లగానే కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారు. ఆ తర్వాత పట్టించుకోకుండా నిద్ర నటిస్తున్నారు.
అనుమతులు జి+2 నిర్మాణం 6అంతస్తులు

గ్రామపంచాయతీ నిబంధనలను పాతరేసి 6 అంతస్తుల భవన నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ నిబంధనలు ఉల్లంఘించి నాగరగూడ ప్రధాన చౌరస్థలో గ్రామపంచాయతీ కార్యాలయానికి కనుచూపు మేరలో 6అంతస్తుల భారీ భవన నిర్మాణం జరుగుతుంది. బిల్డింగ్ పూర్తి దశకు చేరుకున్నాక నోటీసులు ఇచ్చామని చెపుతున్న అధికారులు, అయినా యతేచ్చగా పనులు సాగుతుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. నాగరగూడ పంచాయతీ పరిధిలో రాజకీయ అండదండలతో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ నిర్మాణం తో పాటు,
6 అంతస్థుల భారీ భవన నిర్మాణం చెపుడుతున్నారు . విషయం తెలిసి కూడా గ్రామ సెక్రటరీ కనీసం చర్యలు చెప్పటకపోవటం గమనార్హం. సామాన్యుడు చిన్న నిర్మాణం చేసిన పంచాయతీనుండి హుటా హుటిన పరుగులు తీసే అధికారులు, ఇంత భారీ భవన అక్రమనిర్మాణం జరుగుతుంటే అధికారుల ఆదేశాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. అయితే వారు హెచ్ ఎం డి ఏ నుండి అనుమతులు తీసుకున్నామని చెపుతున్నారని స్పష్టం చేశారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే నోటీసులు ఇచ్చామని చెప్పి నెలరోజులు గడుస్తున్నా
, బిల్డింగ్ పనులు సజావుగా సాగుతున్నాయి. అక్రమనిర్మాణలపై పంచాయతీ సిబ్బంది, అధికారులు
నిద్రవస్థ వీడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి
[అక్రమ నిర్మాణాలపై నాగరగూడ పంచాయతీ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. సెక్రటరీ వైఖరీపై నాగరగూడ గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైన పని ఉంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరని, కార్యాలయానికి వెళ్తే అందుబాటులో ఉండరని, అతనిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.]
