నేటి నుండి సీఎంఅర్ఎఫ్ దరఖాస్తుల నిలుపుదల

నర్సంపేట,నేతిధాత్రి :

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న సందర్భంగా హైదరాబాదులో ఉన్నతాధికారులు ఎలక్షన్ పనుల నిమిత్తం బిజీగా ఉన్న తరుణంలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన ఎటువంటి ఫైల్స్ తీసుకోవడం నిలుపుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో విషయాన్ని గమనించి మండల, గ్రామాలలో మీ నోటీసుకి వచ్చిన ప్రతి సీఎంఅర్ఎఫ్ దరఖాస్తును ఎన్నికల అనంతరం తీసుకొని రాగలరని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు,పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!