 
        New Paddy Purchase Center Opened with MP’s Support
మెదక్ ఎంపీ సహకారం తో.. కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంపేట: నేటి ధాత్రి
ఎంపీ రఘునందన్ రావు సహకారంతో కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో ఇప్పటికే ఐకెపి కొనుగోలు కేంద్రం ఉండగా రైతులకు ఇబ్బందులు కలగకూడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సొసైటీ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్మనమైన శ్రీనివాస్, దుర్గ రెడ్డి, రాజు, అంజయ్య, తదితరులు ఉన్నారు.

 
         
         
        