అమరవీరుల ఆశయాలను సాధిద్దాం
సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆవుల అశోక్
కారేపల్లి నేటిధాత్రి.
CPI(ML) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా..
సింగరేణి కామేపల్లి సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో మాధారం గ్రామంలో. అమరవీరుల జెండాను పార్టీ సీనియర్. కామ్రేడ్ పులాకానీ సత్తి రెడ్డి గారు ఆవిష్కరించారు కామ్రేడ్ బిక్కుమీయా , హనుమంతరావు పాయం లక్ష్మీనారాయణ,సూరపాక లక్ష్మీ నరసుల అమరవీరుల సభ జరిగింది. సభకు అధ్యక్షుడు వేములపల్లి వీరన్న వహించారు
సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ మాట్లాడుతూ. భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం కమ్యూనిస్టులు లో కార్లు ఎన్నో త్యాగాలు చేశారు పాలకులకు వ్యతిరేకంగా భూస్వాములకు ఎదురొడ్డి నిలిచారు దొరలపై తిరగబడినారు వేలాది ఎకరాల్లో భూములు ప్రజలకు పంచిపెట్టారు అని ఆయన అన్నారు భారత విప్లవ ఉద్యమంలో
పుల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు సత్యనారాయణ సింగ్ కాను సైన్యాల్ తరిమేల నాగిరెడ్డి పొట్ల రామ నరసయ్య నీలం రామచంద్రయ్య జంపాల ప్రసాద్ శ్రీపాద శ్రీహరి పైలా వాసుదేవరావు దొరన్న ఎల్లన్న. కుమార్. రాయల సుభాష్ చంద్రబోస్ లింగన్న ఎంతోమంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను పేద ప్రజల కోసం ప్రాణాలర్పించారు అని ఆయన అన్నారు. ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల నాయకులు గూగులోతుతేజ నాయక్ మాట్లాడుతూనే సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా లైన్ కోసం కార్మిక రాజ్యం కోసం పోరాడుతున్నారు ఈ కార్యక్రమానికి. ప్రజాపంథా సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్ మండల నాయకులు వడ్డే వెంకటేశ్వర్లు రావుల నాగేశ్వరావు (డ్రైవర్) కోయిల శ్రీనివాస్ రావు ధరావత్ సక్రు నాయక్. రాము తాటి పాపారావు గ్రామ నాయకులు
రమేష్ ముక్తి నాగేశ్వరావు లక్ష్మీనారాయణ కోయిల ఉపేందర్. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.