త్వరగా నిధులు కేటాయించి బీద వైశ్యులను ఆదుకోవాలి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి వైశ్యుల పాలాభిషేకం .. . .
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)తెలంగాణ వైశ్య సమాజానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల కమలాపూర్ పట్టణ, మండల ఆర్యవైశ్య ఆధ్వర్యంలో కమలాపూర్ బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల,పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు భూపతి రాజు, కోనిశెట్టి మునిందర్,గౌరవ అధ్యక్షులు నూక సంపత్ కుమార్,ప్రధాన కార్యదర్శులు సుద్దాల కార్తీక్ కార్తీక్, వెనిశెట్టి పున్నమ్ చందర్,కోశాధికారి వెనిషేట్టీ శివకుమార్, నంగునూరి సాగర్ బాబు,నాయకులు వీర భద్రయ్య, సాంబమూర్తి, జగదీశ్వర్, కంభంపాటి ప్రసాద్,కాంతినాథ్, నాగేశ్వరరావు,రమేష్,రాజేందర్,రఘురాం,సతీష్,సాంబశివుడు,సంపత్,ఉపేందర్,శ్రీనివాస్,జయకృష్ణా,రమేష్ ,శ్యాంసుందర్,తదితరులు పాల్గొన్నారు…….
ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మునిందర్ మాట్లాడుతూ ..
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అనుమతినివ్వడం ఆర్యవైశ్యులందరికీ గర్వకారణం అన్నారు.గత టీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన,కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో విఫలం చెందింది.ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించడం కొరకు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు పలుమార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తూ గత ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడం జరిగింది.ఐనప్పటికీ ఏర్పాటుకు ఆమోదం లభించలేదు.రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందే ఆర్యవైశ్య మహాసభ పెద్దలకు ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తద్వారా ఆర్యవైశ్యులందరికీ లబ్ధి చేకూరుస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇవ్వడమే కాకుండా మాట నిలబెట్టుకుంటూ,నేడు ఇచ్చిన హామీ మేరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ప్రకటించడం జరిగింది.దీనికి అనుగుణంగా ప్రభుత్వం వెంటనే పాలకమండలి ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆర్యవైశ్యులను పట్టించుకున్న పాపాన పోలేదు,నూతనంగా ఏర్పాటు అవుతున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీద ఆర్యవైశ్యు లందరూ లబ్ధి పొంది ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ముందు కొనసాగాలి.ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రితో కార్పొరేషన్ అంశాన్ని చర్చించడమే కాకుండా దాన్ని మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించడం పలితంగా నిన్న జరిగిన కేబినెట్ లో మంత్రిమండలి కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం తెలంగాణ వైశ్య జాతి చరిత్రలో మైలు రాయిగా మిగిలిపోతుంది.ఏర్పాటు కు ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కి,రాష్ట్ర ముఖ్యమంత్రికి,జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు ,పొన్నం ప్రభాకర్ లకు తెలంగాణ వైశ్య జాతి ఋణపడి వుంటుందన్నారు.