
సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులో సమావేశంలో నియోజకవర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నేతన్నలకు శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో చేపట్టిన కార్యాచరణ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించుకొని పెట్టిన బకాయిలను నేతన్నలకు విడతల వారిగా చెల్లింపులతో పాటు 8 కోట్ల మీటర్ల బట్టతో చీరెలు ప్రభుత్వం నుండి ఆర్డర్ నేతన్నలకు ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. నేత కార్మికులకు ఆధునిక యంత్రాలని అందించి భవిష్యత్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ద్వారా అనేక అద్భుతాలు చేయనున్నారన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వ కుటిల నీతి తో నేత కార్మికులకు అంత్యోదయ కార్డులు, కరెంటు సబ్సిడీ తొలిగించగా, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ వేసి నేత కార్మికుల నడ్డి విరిచిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో పట్టణంలోని నేతన్నల 5 వేల కుటుంబాలకు ఏడాదంతా జీవనోపాధి పొందనున్నారని తెలిపారు. అదే విదంగా జీవో 1 తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో చేస్తున్న మహిళలకు సంబంధించి బట్టను నేత కార్మికులకు ఆర్డర్ ఇస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ అనుమతులతో ప్రభుత్వ భూములలో చేపట్టిన నిర్మాణాలను తొలిగించుటకు హైడ్రా రాగానే మొదటగా కేటీఆర్ బినామీ ముందుగా కోర్టు వెళ్లారని ఆరోపించారు. ప్రజా పాలన విడిచి కేటీఆర్, హరీష్ రావు కవితకు బెయిల్ కోసం చేయని ప్రయత్నాలు లేవని, బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషిగా కోర్టు నిర్ధారించలేదన్నారు. పథకాల పేరుతో
టీఆర్ఎస్ పార్టీ దోచుకున్న ప్రజల సొమ్మును వరద బాధితులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.